Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12-01-2022)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 12 Jan 2022 04:02 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.
 

ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.

శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మానసిక సంతృప్తిని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. లక్ష్మీదేవి దర్శనం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

శరీర సౌఖ్యం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదేవత శ్లోకాలు చదివితే మంచిది.

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.

కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

 

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను, విషయాలను సాగదీయకండి. త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. ఈశ్వర శ్లోకాలు చదవాలి.  

ప్రారంభించిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని