Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12-06-2022)
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభించిన పనులు పనులు చకచకా పూర్తవుతాయి. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
పట్టు వదలకుండా ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగండి. చేసే పనిలో నిపుణత అవసరం. మనపక్కనే ఉంటూ, మనల్ని ఇబ్బందిపెట్టేవారున్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.
శుభ భవిష్యత్తు కోసం ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.
బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
అనుకూల సమయం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్దిస్తాయి. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. దత్తాత్రేయ సందర్శనం శుభప్రదం.
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ శుభకరం.
ధర్మసిద్ధి ఉంది. ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శివాష్టోత్తరం చదివితే ఇంకా బాగుంటుంది.
ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.
మొదలుపెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలు ఉన్నాయి. శ్రీవారి దర్శనం శుభాన్ని ఇస్తుంది.
కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. చేపట్టిన పనులను పూర్తిచేయడంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Telugu movies: ఈ వారం అటు థియేటర్.. ఇటు ఓటీటీలో సినిమాలే సినిమాలు..!
-
General News
Heavy Rains: మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణకు భారీ వర్షాలు!
-
World News
China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
-
India News
PM Modi: వెంకయ్యనాయుడి నుంచి సమాజం చాలా నేర్చుకోవాలి: ప్రధాని మోదీ
-
Sports News
CWG 2022: కామన్వెల్త్ చివరి రోజు.. మరో ఐదు స్వర్ణాలే లక్ష్యంగా..
-
Sports News
Avinash Sable: స్టీపుల్‌ఛేజ్.. భారతీయులూ గెలవగలరని నిరూపించాడతడు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస