Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/22)

Updated : 12 Aug 2022 05:10 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.పెద్దల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఇష్టకార్యసిద్ధి ఉంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. ధన,ధాన్య లాభాలు ఉంటాయి. అవసరానికి ఆదుకునేవారు ఉంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బలమైన ప్రయత్నంతో ధనలాభం ఉంది. దుర్గాశ్లోకం చదవండి.

చేపట్టే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. బంధుప్రీతి ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభకరం.

పెద్దల సలహాలు శక్తిని ఇస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శని శ్లోకం చదవాలి.

మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. తోటి వారి సహాయంతో కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. మనశ్శాంతి కోల్పోకుండా చూసుకోవాలి. శివాష్టోత్తరం చదివితే మంచిది.

కీలక విషయాల్లో  శ్రద్ధ చూపండి. ఖర్చుల విషయంలో పొదుపును పాటించాలి. అకారణ కలహ సూచన ఉంది. అనవసర విషయాల్లో ఊరుకోవడం ఉత్తమం.శివనామాన్ని జపించాలి.

పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. అప్పుల బాధ పెరగకుండా చూసుకోవాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. పనులలో ఆటంకాలు కలుగుతాయి. తొందరపాటు చర్యలు వద్దు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభదాయకం.

 

ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. యశస్సు, మనోల్లాసం, ధర్మసిద్ధి కలుగుతాయి. సత్సాంగత్యం ఏర్పడుతుంది. ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి .తోటి వారి సహకారాలు అందుతాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. మాతృసౌఖ్యం, ధన,ధాన్యవృద్ధి ఉన్నాయి. గణపతి ఆరాధన మంచిది.

ధర్మసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ఇష్టదైవారాధన వల్ల మేలు జరుగుతుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని