Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/22)

Published : 14 Aug 2022 04:01 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఇష్టకార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి. దత్తాత్రేయ ఆరాధన చేస్తే మంచిది.  

గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో శ్రమ ఫలిస్తుంది. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.

ప్రారంభించిన పనులను పూర్తిచేస్తారు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనస్సు చెప్పింది చేయండి. శుభం చేకూరుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

మీ మీ రంగాల్లో జయకేతనం ఎగురవేస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మిదేవి సందర్శనం శుభప్రదం.

సంపూర్ణ మనోధైర్యంతో  ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శ్రీఆంజనేయస్వామిని ఆరాధించాలి.

అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. శ్రీసాయిబాబా వారి నామాన్ని జపించడం ఉత్తమం.
 

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. లక్ష్మీధ్యానం శుభప్రదం.

శుభకాలం. చేపట్టే పనుల్లో శుభం చేకూరుతుంది.బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. ఇష్టదైవప్రార్థన మేలు చేస్తుంది.

 

మిశ్రమకాలం. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. ఆర్ధికపరంగా ఆచితూచి వ్యవహరించాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదేవతా శ్లోకం చదవాలి. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని