Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14-10-2021)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 14 Oct 2021 04:03 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శుభ సమయం. మీ మీ రంగాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

ప్రారంభించిన పనిలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

మనస్సౌఖ్యం ఉంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

మంచి ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్ని  చేకూరుస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆనందోత్సాహాలతో  కాలాన్ని గడుపుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.

మనోబలం సర్వదా రక్షిస్తుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికీ  ప్రశంసలు లభిస్తాయి. కొన్ని విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు అందుతాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.

కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉంటాయి. శ్రీవిష్ణు నామాన్ని పఠించడం మంచిది.

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు,మిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

ప్రారంభించిన కార్యక్రమాలలో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.  
 

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి. చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన శుభప్రదం.

 

గొప్ప ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు దుర్గాధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
 

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కీలక విషయాలను కొన్నాళ్లు వాయిదా వేసుకుంటే మంచిది. కలహసూచన ఉంది. ఇష్ట దైవప్రార్థన మేలు చేస్తుంది.

చక్కని విజయాలు ఉన్నాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని