ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)

Published : 15 Aug 2022 03:06 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుత్సాహంగా ఉండకూడదు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.

చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

మొదలుపెట్టిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలావసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథాచేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి. శివ ఆరాధన మంచినిస్తుంది.

మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. దుర్గ ధ్యానం శుభప్రదం.

భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.  మనసు చెడ్డ పనులమీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. తోటివారితో అభిప్రాయ బేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

విజయ సిద్ధి కలదు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్నవిధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయ గలుగుతారు. మీ మీ రంగాల్లో  మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సునిస్తుంది.

ఆర్థికాంశాల్లో పురోగతి ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. చక్కటి ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. శివ నామస్మరణ మంచిది.

 మీ మీ రంగాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధికమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఎవ్వరితోను విభేదించకండి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం

 

ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలతో  మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం

 చేపట్టిన పనులను దైవానుగ్రహంతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

చేపట్టినపనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. దైవబలం ఉన్నది. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలున్నాయి. ఇష్టదేవతా దర్శనం శుభాన్నిస్తుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని