Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16-07-2022 )

ఈ రోజు ఎవరి  రాశి ఫలం ఎలా ఉందంటే? (16/07/22)

Updated : 16 Jul 2022 04:16 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఇష్ట కార్యసిద్ధి ఉంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శివ ఆరాధన చేస్తే  మంచిది.

వృత్తి,ఉద్యోగాల్లో  మిశ్రమ వాతావరణం ఉంది. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి,మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
 

చేపట్టే పనుల్లో ఆటంకాలు అధికం అవుతాయి. హుషారుగా పనిచేస్తే ఒత్తిడిని జయిస్తారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుంది. సూర్యాష్టకం చదివితే శుభప్రదం.

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. బంధు,మిత్రులతో కలిసి శుభ,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.

ఉద్యోగంలో ఉన్నతస్థితికి  చేరుతారు. వ్యాపారంలో లాభాలబాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శివారాధన శక్తిని ఇస్తుంది.

చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో  అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.
 

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.

ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలకు సంబంధించి కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి  ప్రవర్తించాల్సి ఉంటుంది. శివ స్తోత్రం చదవడం మంచిది.

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.

ముఖ్య వ్యవహారాలు, విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాస్తోత్రం చదవాలి.

గొప్ప శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దైవారాధన మానవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని