ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17-03-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17-03-2022)

Published : 17 Mar 2022 04:56 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి . అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

ముఖ్య వ్యవహారాలలో గొప్ప లాభాలు పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. సాయిబాబా దర్శనం శుభప్రదం.

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

అవసరానికి తగిన సహాయం అందుతుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి, అనుకూల నిర్ణయం తీసుకుంటారు. అది కుటుంబ సభ్యులకు మేలు చేస్తుంది. గోవిందనామాలు చదవటం మంచిది.

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.

శుభకాలం. ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ ఫలిస్తుంది. కీలక వ్యవహారంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. శనిధ్యానం శుభప్రదం.

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన మానవద్దు.

 

శారీరక శ్రమ పెరగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. శివనామస్మరణ మేలు చేస్తుంది.

మంచి ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద,శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని