Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/09/21)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 18 Sep 2021 04:03 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు.అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు,వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి  దర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.
 

చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టనివారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.

శుభకాలం. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ దర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ప్రయత్నకార్య సిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందు,వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభాన్ని చేకూరుస్తుంది.

సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఇష్టదైవారాధన శుభప్రదం.
 

చేపట్టే పనిలో దోషాలు పెరగకుండా చూసుకోవాలి. ఆచితూచి ఖర్చుపెట్టాలి. విచక్షణా జ్ఞానంతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. చక్కటి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది.

అర్థలాభం ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. బుద్ధిబలం బాగుండటం వలన కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవారాధన శుభప్రదం.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. శివ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
 

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రక్త సంబంధీకులతో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఉన్నారు జాగ్రత్త. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ఈశ్వర ధ్యానం చేయండి.

శుభకాలం. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ఉద్యోగంలో శుభఫలితాలు ఉన్నాయి. అధికారుల సహకారం ఉంది. విష్ణు నామస్మరణ శక్తిని ఇస్తుంది.  

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని