Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (21/02/23)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 21 Feb 2023 05:09 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మంచి సమయం. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. లాభంలో చంద్రబలం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు.ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

ధర్మసిద్ధి ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి.శివారాధన శుభప్రదం.

అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

నిర్ణీత కాలంలో పనులను పూర్తిచేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసట చెందకుండా చూసుకోవాలి. శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

కొన్ని కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభకరం.  

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. 

బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.

 

ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారం ఇతర విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయబేధాలు వస్తాయి. దుర్గాస్తోత్రం చదవాలి. 

అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. వ్యయంలో చంద్రబలం అనుకూలంగా లేదు. మీచుట్టూ గిట్టనివాళ్లు చేరి మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని