Published : 22 Jan 2022 04:17 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (22-01-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

వృత్తి,వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్ని ఇస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి.   సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

బలమైన సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. విష్ణు నామస్మరణ శక్తిని ఇస్తుంది.      

శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు.  ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్ధ, వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.    

ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడికి లోనవకుండా, ఓర్పుగా వ్యవహరించండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా చేయవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. గోవింద నామాలు చదవడం మంచిది.  

మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. గణపతి దర్శనం శుభప్రదం.

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గోసేవ చేస్తే  బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ద వద్దు. గోవిందనామాలు చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.

కొన్ని విషయాలలో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. నవమంలో చంద్రస్థితి అనుకూలించడం లేదు. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

 

ప్రయత్న కార్యసిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. విందూవినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు. ఇష్టదైవ నామస్మరణ శుభకరం.

ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధు,మిత్రులతో విబేధాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.

ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. పొదుపు పాటించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనకు గురవుతారు. శివనామాన్ని జపించాలి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని