Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (22/02/23)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Updated : 22 Feb 2023 02:15 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబసభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గాధ్యానం శుభప్రదం.

శుభఫలితాలు ఉన్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభకరం.

మీదైన ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. గురుధ్యానం శుభప్రదం.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శని జపం చేసుకోవాలి.

ప్రారంభించిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. శ్రమ అధికం అవుతుంది. శివ నామాన్ని జపించాలి.

ధర్మసిద్ధి ఉంది. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గా స్తోత్రం చదవాలి.

స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. ఈశ్వర ధ్యాన శ్లోకాన్ని చదివితే మేలు జరుగుతుంది.

ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన శుభదాయకం.

కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. శని శ్లోకాన్ని చదివితే అన్ని విధాలా మంచిది.

 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్ధికంగా మేలైన సమయం. ఇష్టదేవత సందర్శనం ఉత్తమం.

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం ఉంది. అధికారుల సహకారం ఉంటుంది. తప్పుదోవ పట్టించేవారు ఉన్నారు, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు సఫలం అవుతాయి. దుర్గాధ్యానం శుభప్రదం.

ప్రారంభించిన పనులు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని