Published : 22 May 2022 05:49 IST

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (22-05-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మంచి కాలం. మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. విష్ణు నామస్మరణ చేస్తే మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. చంద్ర ధ్యానం శుభప్రదం.

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకండా చూసుకోవాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఆంజనేయ స్వామి ని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి

గ్రహబలం విశేషంగా యోగిస్తోంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం. 

మంచి కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధన ధాన్య వృద్ధి ఉంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకవార్త ఆనందాన్నిస్తుంది. శివనామస్మరణ మంచినిస్తుంది.  

రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయమిది. బంధుమిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చును. గోసేవ చేయాలి.

చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మితభాషణం శ్రేయస్కరం. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం మంచిది. మనోబలం పెరగడానికి హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

 

ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

 పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఆపదలు తొలగడానికై గోవిందా నామాలు చదివితే మంచిది.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని