Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (23/02/23)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 23 Feb 2023 00:20 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కలహసూచన ఉంది. ఆదిత్య హృదయం చదవాలి.

ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ మంచి ఫలితాలను ఇస్తుంది.

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన మంచిది.

మీ మీ రంగాల్లో  ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

 

శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బంది పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.

చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. సాయిబాబా ఆరాధన శుభప్రదం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని