Updated : 24 May 2022 06:00 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (24-05-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దుర్గాదేవిని దర్శిస్తే మంచి జరుగుతుంది.

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపివార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధు,మిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు..

అనుకున్నది సాధించడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. బంధు,మిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీరామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
 

మీ మీ రంగాల్లో అలసట చెడకుండా చూసుకోవాలి. ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శ్రేయోదాయకం.

శుభకాలం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది.

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోవద్దు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. నిందారోపణలు చేసేవారు ఉన్నారు. కలహాలకు దూరంగా ఉండాలి. ఈశ్వర దర్శనం ఉత్తమం.
 

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహారాధన శుభప్రదం.

గ్రహబలం అనుకూలంగాఉంది. చేసే ప్రతి పని అనుకూలతను ఇస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధు,మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

 

చేసే పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అకారణ కలహసూచన ఉంది. కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. దైవారాధన మానవద్దు.

ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. మీ మీ రంగాల్లో పేరుప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి శివారాధన చేయాలి.

పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. శ్రమ పెరుగుతుంది. గిట్టనివారి వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ఆరోగ్యంపై  శ్రద్ధ అవసరం. లక్ష్మీఆరాధన శుభప్రదం.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని