Updated : 24 Nov 2021 06:03 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (24-11-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

కీలక వ్యవహారాల్లో  శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. లలితాదేవి నామాన్ని స్మరించాలి.

శుభాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి  సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీ వేంకటేశ్వరుడిని ఆరాధన వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.

మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శత్రువులు మీ మీద విజయం సాధించలేరు. దుర్గాస్తుతి పఠించాలి.

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీ శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆగ్రహావేశాలకు పోకూడదు. శని శ్లోకం చదవాలి.

మనఃసౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ధనధాన్య లాభాలు ఉన్నాయి. సత్యనిష్ఠతో విజయసిద్ధి ఉంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.
 

 

కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఇష్టదైవ సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని