Updated : 25 May 2022 06:03 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-05-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. నారాయణ మంత్రాన్ని జపించాలి. 

మీ మీ రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.

గ్రహబలం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులను అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. లలితాదేవి నామస్మరణ శుభకరం.

ధర్మకార్యాచరణతో లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి కలదు. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగినట్టుగా వ్యయం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గా నామస్మరణ ఉత్తమం.

శుభ ఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.

చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్త పడాలి. సంతోషంగా ఉంటారు. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శివ దర్శనం మేలు చేస్తుంది.

ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక శుభవార్త వింటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.

 

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్ధికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.

మిశ్రమ కాలం. బంధువుల వ్యవహారాలలో అతిచొరవ తీసుకోవద్దు. చేపట్టే పనిలో బద్ధకం పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సూర్యారాధన మేలు చేస్తుంది.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందు,వినోదాలతో కాలాన్ని గడుపుతారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఆపదలు తొలగుతాయి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని