Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26/07/2022)

ఈ రోజు ఎవరి రాశి ఫలం ఎలా ఉందంటే? 

Updated : 26 Jul 2022 06:15 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ  మీ రంగాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన మంచిది.

ఉత్సాహంగా  పనిచేయాల్సిన సమయమిది. కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు.వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి. 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు. 

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచీచెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారంలో ముందుచూపు అవసరం. దైవబలం రక్షిస్తోంది. విష్ణు సందర్శనం శుభప్రదం.

ఒక  ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గణపతి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం అంటీముట్టనట్టు ఉండటమే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది. 

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచిది.

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 

శుభ ఫలితాలు కలవు. కొత్త పనులను ప్రారంభిస్తారు.పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. ఇష్టదేవతను ఆరాధిస్తే మంచిది. 

 

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం. 

ప్రారంభించిన కార్యక్రమాలు నలుగురికీ ఆదర్శప్రాయంగా  ఉంటాయి. మీదైన రంగాల్లో  అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. 

బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. చంద్రధ్యానం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని