Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-09-21)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 26 Sep 2021 03:01 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బలమైన  ప్రయత్నంతో ధనలాభం ఉంది. దుర్గా శ్లోకం చదవండి.

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. పెద్దల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఇష్టకార్యసిద్ధి ఉంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. ధన,ధాన్య లాభాలు ఉంటాయి. అవసరానికి ఆదుకునేవారు ఉంటారు. ఇష్టదైవారాధన వల్ల మంచి జరుగుతుంది.

అంతా శుభమే జరుగుతుంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చేకాలం. ఇష్టదైవారాధన శుభప్రదం.  

మనస్సౌఖ్యం ఉంది. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్యవినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

పనులకు అడ్డంకులు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

ప్రారంభించబోయే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి.  మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించడం మంచిది.  

మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

 

మనోబలాన్ని కోల్పోరాదు. మంచి పనులు చేపడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.  

మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.  

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని