Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవిని ఆరాధన శుభప్రదం.
తలచిన కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.
పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగండి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. విందు,వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
కార్యసిద్ధి ఉంది. మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్యసాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే ఇంకా బాగుంటుంది.
మీ మీ రంగాల్లో లాభదాయక ఫలితాలు సొంతం అవుతాయి. దైవబలం అనుకూలిస్తోంది. ఆశయాలు సిద్ధిస్తాయి. కాలం సహకరిస్తోంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
కష్టపడి పనిచేస్తే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి.కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.
మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలను సాధిస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. శ్రీఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. సంపూర్ణకార్యసిద్ధి ఉంది. సంపూర్ణ మనోబలం కలిగి ఉంటారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి
మీ మీ రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. బంధుప్రీతి కలదు.
స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఇష్టదైవనామస్మరణ ఉత్తమం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్గా అడిగారు: మల్లారెడ్డి
-
Politics News
Vundavalli Sridevi: జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
-
Movies News
NTR: ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ సర్ప్రైజ్ గిఫ్ట్ .. తనకూ కావాలని కోరిన తారక్
-
World News
Washington: వాషింగ్టన్లో భారత దౌత్యకార్యాలయంపై దాడి కుట్రను భగ్నం చేసిన సీక్రెట్ సర్వీస్