Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-11-2021)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 27 Nov 2021 04:03 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆపదలు తొలగుతాయి. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అష్టలక్ష్మీ స్తోత్రం పఠిస్తే మంచిది.

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. లక్ష్మీ స్తుతి  పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించినదాని కన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.

ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

చిరస్మరణీయ విజయాలు సొంతమవుతాయి.   మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గా ధ్యాన శ్లోకం చదవండి.

మీ మీ రంగాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో వైరసూచన. మనస్తాపం, శ్రమ పెరుగుతుంది. గణపతి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలరు.

శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.  మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మేలు చేకూరుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. చంద్ర ధ్యానం చదివితే  శుభఫలితాలు కలుగుతాయి.

 

ప్రారంభించే పనులలో పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి  ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామ నామం జపించడం ఉత్తమం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని