Updated : 28 Apr 2022 03:38 IST

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28-04-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం. ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల వదలకండి.

సమన్వయలోపం లేకుండా చూసుకోవాలి. సమర్ధతను పెంచాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోరాదు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శుభఫలితాలు పొందడానికి శ్రీవేంకటేశ్వరుని సందర్శించాలి.

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభాలను అందిస్తుంది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

బుద్ధిలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

శ్రమ ఫలిస్తుంది. ముఖ్య వ్యవహారాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు. ఆంజనేయ స్తోత్రం పారాయణ మంచిది.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అష్టమ చంద్రసంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు అవసరం. చంద్ర ధ్యానం శుభప్రదం.

 

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బందులపాలవుతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయసహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

దైవబలం సంపూర్ణంగా ఉంది. మానవ ప్రయత్నం బలంగా ఉండాలి. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని