Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28-09-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28-09-2022)

Published : 28 Sep 2022 03:02 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

తలపెట్టిన పనులు విజయాన్నిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.

సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతతకై లక్ష్మీసందర్శనం ఉత్తమం.  

కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడక పోవచ్చును. అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దుర్గాధ్యానం వల్ల మేలు జరుగుతుంది.

ఏ పనిని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. అధికారుల సాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన శుభదాయకం.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆదిత్యహృదయ స్తోత్రం పఠించడం మంచిది.

 

దైవ బలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలున్నాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం.

ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. ద్వాదశ చంద్ర స్థితి అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలుచేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. వేంకటేశ్వర స్వామి సందర్శనం శక్తినిస్తుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts