Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-01-2022)

Today Horoscope: 12 రాశులవారి రాశి ఫలం వివరాలు...

Published : 29 Jan 2022 04:00 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. లలితాదేవి నామాన్ని స్మరించాలి.

శుభాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల మరిన్ని శుభఫలితాలను పొందగలుగుతారు.

కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ఇష్టదైవ దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్దిబలం బాగుంటుంది. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శత్రువులు మీ మీద విజయం సాధించలేరు. దుర్గాస్తుతి చదవాలి. 

అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శ్రీశివపార్వతులను పూజించడం శుభకరం.

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

మంచి సమయం. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. అన్నిరకాలుగా మేలు చేకూరుతుంది. శని శ్లోకం చదవాలి.
 

మనఃసౌఖ్యం ఉంది. బంధు,మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ధన,ధాన్య లాభాలు ఉన్నాయి. సత్యనిష్ఠతో విజయసిద్ధి ఉంది. లక్ష్మీధ్యానం శుభప్రదం.
  

మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.

శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని