Updated : 30 Jun 2022 05:06 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.

సౌభాగ్యసిద్ధి ఉంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో చంద్రుడు అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తుతి మంచిది.

కార్యవిఘ్నాలు లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మనఃపీడ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయుని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి  కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

ఉద్యోగంలో మీ పై అధికారులతో  జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ ఉత్తమం.

శరీర సౌఖ్యం ఉంది. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.

ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని