Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-11-2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-11-2022)

Published : 30 Nov 2022 00:16 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. లాభంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

శ్రమకు తగ్గ ఫలాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టే పనుల్లో  ఓర్పు చాలా అవసరం. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. రవి ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

మిశ్రమకాలం. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గా దేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.

ఏకాగ్రతతతో పనిచేస్తే విజయం త్వరగా సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. దుర్గాధ్యానం శుభాన్ని చేకూరుస్తుంది.

సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్ధికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య అష్టకం చదవండి.

మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త మనఃస్సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.

ప్రారంభించబోయే పనుల్లో ఆపదలు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో  ముందుకు సాగితే మేలైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.

పనిలో మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

 

ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి ఆంజనేయ ఆరాధన చేయాలి.

శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.దుర్గాస్తుతి చదవాలి.

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్నిఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు.  అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శనిధ్యానం శుభప్రదం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు