Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/07/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 04 Jul 2024 02:45 IST

మేషం

మీ మీ రంగాల్లో ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

వృషభం

మిశ్రమ కాలం. కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడకపోవచ్చు. అస్థిర నిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి. 

మిథునం

ప్రారంభించిన పనులలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. మీ బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన శ్రేయస్సును ఇస్తుంది. 

కర్కాటకం

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. 

సింహం

ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన మంచిది. 

కన్య

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఇష్టదైవ సందర్శనం ఉత్తమం.

తుల

మీ మీ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మితభాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

వృశ్చికం

శుభకాలం. చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. 

ధనుస్సు

ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీలక్ష్మిదేవి సందర్శనం ఉత్తమం.

మకరం

పట్టుదల చాలా అవసరం. ఒత్తిడి తగ్గించుకోవాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి.పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈశ్వరారాధన శుభప్రదం. 

కుంభం

శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన మంచిది.

మీనం

సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మీ సందర్శనం ఉత్తమం. 

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని