Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/07/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 08 Jul 2024 00:46 IST

మేషం

తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది.  గోసేవ చేస్తే బాగుంటుంది.  

వృషభం 

మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభాన్ని పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

మిథునం

పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొనితెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం

ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది.  మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

సింహం

కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.   హనుమాన్ చాలీసా పఠించాలి.

కన్య

కీలక విషయాల్లో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగస్తవము చదివితే బాగుంటుంది.

తుల

సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రము పఠించడం మంచిది.

వృశ్చికం

తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. శని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

ధనుస్సు

మిశ్రమ కాలం. ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.

మకరం

శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన మంచిది.

కుంభం

శ్రమఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉంటారు. ఆంజనేయ స్తోత్రము పారాయణ చేస్తే మంచిది.

మీనం

పెద్దలు సూచించిన మార్గంలో ముందుకుసాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధనధాన్య లాభాలున్నాయి. మనస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని