Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/06/23)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 05 Jun 2023 01:56 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా  ముందుకుసాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి.  దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి చదవాలి.

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అష్టమ చంద్ర దోషం ఉంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.  ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శివ నామస్మరణ ఉత్తమం.

శుభసమయం. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవప్రార్థన శుభప్రదం. 

మంచి  పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది.  ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

 చేపట్టిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి.  సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.

 మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి.  అనవసర విషయాల్లో తలదూర్చకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఆదిత్య హృదయం  మంచి ఫలితాన్నిస్తుంది.

 ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని  పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో  కుటుంబసభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగాలి. మీరు చేసిన మంచి పనుల వల్ల ఆపదలు దూరమవుతాయి. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి.  గణపతి సందర్శనం శుభప్రదం.

సకాలంలో పనులను పూర్తిచేస్తారు.  బంధుమిత్రులను కలుపుకుపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శివున్ని ఆరాధిస్తే మంచిది.

 

ప్రయత్న కార్యసిద్ధి ఉంది.  అపార్ధాలకు తావివ్వకండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి.  మనస్సు చెడును ఊహిస్తుంది.  తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు.  వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  ప్రయాణాల్లో జాగ్రత్త.  దైవారాధన మనకండి.

మీ మీ రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.  వ్యాపారస్తులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

  బంధుమిత్రుల ఆదరాభిమానాలుంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లక్ష్మీస్తోత్రం చదివితే మంచిది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు