Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/06/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 19 Jun 2024 00:13 IST

మేషం

వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కష్టేఫలి అనే సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని అందర్నీ కలుపుకొని పోవడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. అవసరానికి తగ్గట్టు ఖర్చు చేయాలి. శని శ్లోకం చదువుకోవాలి.

వృషభం

సవాళ్ళని స్వీకరించి వాటిని ఎదుర్కొనే తత్వం మిమల్ని విజయానికి చేరువ చేస్తుంది. గిట్టని వారు చాప కింద నీరులా ఇబ్బంది పెడతారు. స్థిర సంపాదన కలదు. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. లలితా దేవి నామస్మరణ మంచిది.

మిథునం

అనుకూలమైన సమయం.మొహమాటాన్ని పక్కన పెట్టినట్లయితే ఇబ్బందులు దరి చేరవు. ఉన్నతమైన ఆలోచనలు చేసి వాటిని సాధించే వరకు వదిలిపెట్టరు. ఆర్థిక అభివృద్ధి కలదు. లక్ష్మీ గణపతి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది.  

కర్కాటకం

మీ లక్ష్యాన్ని అడుగులుగా మార్చడం ద్వారా విజయం సాధిస్తారు. పనిలో ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడండి. కీలక నిర్ణయాలు తీసుకోబోయే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ధనయోగం మిశ్రమంగా ఉంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టం. 

సింహం

మీ ఆత్మవిశ్వాసమే మీ విజయం. ఉద్యోగస్తులకు మంచి కాలం. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టబోయే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం కామాక్షే నమః అనే నామాన్ని జపించాలి 

కన్య

వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు సాధించడానికి శ్రమ అధికమవుతుంది. ఎవరినీ అతిగా నమ్మరాదు. ఆర్థికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. సూర్య నమస్కారం చేస్తే మంచిది.

తుల

 విజయానికి వెనుక ఉన్న పరమ రహస్యం నిర్విరామ కృషి ఒక్కటే అని తెలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆనందకరమైన ఫలితాలు సాధిస్తారు. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ధన లాభ సూచితం. వినాయక సందర్శనం మేలు చేస్తుంది. 

వృశ్చికం

మీ మీ రంగాల్లో అభివృద్ధి సాధించాలని తపన మిమ్మల్ని గెలుపు బాట పట్టిస్తుంది. అవసరానికి తగిన ధనం చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈశ్వర ధ్యానం సత్ఫలితాన్ని ఇస్తుంది. 

ధనుస్సు

మీదేనా రంగంలో మీ బుద్ధి బలాన్ని ఉపయోగించి ఓ కీలక సమస్యను పరిష్కారం చేస్తారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. శివపార్వతుల సందర్శనం చేయాలి.

మకరం

మంచి ఆలోచనలతో మీరు చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది. మీ ప్రతిభే మీకు ఆయుధం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకెళతారు. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. దైవ బలం పెరగడానికి గురు ధ్యాన శ్లోకం చదవాలి. 

కుంభం

మీరు వేయబోయే అడుగు గురించి స్థిరంగా ఆలోచించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గా ధ్యానం శ్రేయదాయకం.

మీనం

ఉద్యోగస్తులకు శుభకాలం. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయంలో పై అధికారుల సహకారం అందుతుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఆర్థికపరంగా శుభకాలం. సాయినామం జపించాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు