Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/06/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 14 Jun 2024 00:18 IST

మేషం

ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనస్సు చెడు విషయాలపైకి  మళ్లకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

వృషభం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో పర్వాలేదనిపిస్తుంది.పెద్దల సలహాలు పనిచేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. గోసేవ చేయడం మంచిది.

మిథునం

మంచికాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవధ్యానం మేలు చేస్తుంది.

కర్కాటకం

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

సింహం

కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంది. శ్రీలక్ష్మీస్తుతి శ్రేయస్కరం.

కన్య

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

తుల

మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. లాభచంద్ర సంచారం అనుకూలమైన లాభాలను ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన మంచిది.

వృశ్చికం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణతో అంతా మంచి జరుగుతుంది. 

ధనుస్సు

కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం. 

మకరం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

కుంభం

మంచిపనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. తోటివారితో సానుకూలంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. శని ధ్యానం చేయాలి.

మీనం

శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానవద్దు.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని