Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 17 Jun 2024 00:07 IST

మేషం

మనఃస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచే జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.

వృషభం

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తిశ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ధర్మసిద్ధి ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మిథునం

మీ కృషి ఫలిస్తుంది. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. లలితాదేవిని స్తుతించాలి.

కర్కాటకం

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

సింహం

మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

కన్య

ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. శివనామాన్ని జపించడం ఉత్తమం.

తుల

గ్రహబలం అనుకూలిస్తోంది. అభివృద్ధి  కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవప్రార్థన శుభప్రదం.

వృశ్చికం

కొన్ని విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.

ధనుస్సు

మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. కనకధారాస్తవం చదవాలి.

మకరం

మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

కుంభం

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. విష్ణు ధ్యానంతో మనోబలం పెరగడంతో పాటు శుభప్రదం.

మీనం

ప్రారంభించబోయే పనుల్లో దేహజాఢ్యాన్ని రానివ్వకండి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచలబుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది.

 

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని