Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/06/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 18 Jun 2024 00:10 IST

మేషం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన  పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృషభం

శుభయోగాలు ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మానసిక శక్తిని ఇస్తుంది. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం.

మిథునం

చేసే పనిలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతమైన ఆలోచనలతో ముందుకు సాగితే అంతా మేలు జరుగుతుంది. విష్ణు నామస్మరణ వల్ల అంతా మంచే జరుగుతుంది. 

కర్కాటకం

శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ శుభప్రదం.

సింహం

మీ శ్రమ ఫలిస్తుంది. బంధువుల సహకారం ఉంటుంది. లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మంచిది.

కన్య

ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అవసరానికి మించి ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాల్లో శత్రువులను కూడా కలుపుకొనిపోవడం మంచిది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

తుల

మనఃస్సౌఖ్యం కలదు. మీ బుద్ధిబలంతో పూర్తి చేయాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సమాజంలో మంచిపేరు వస్తుంది. కులదైవ సందర్శనం శ్రేయస్కరం.

వృశ్చికం

ముఖ్య వ్యవహారాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ధనుస్సు

ఇష్టసిద్ధి ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలత ఉంది. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు.ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాస్తోత్రం చదవాలి.

మకరం

ప్రారంభించిన పనుల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శివస్తోత్రం చదవడం మంచిది.

కుంభం

ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి.

మీనం

మిశ్రమకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు పెరుగుతాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కనకధారాస్తవం చదవాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు