Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/06/24)

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.

Updated : 21 Jun 2024 00:41 IST

మేషం

లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మసందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

వృషభం

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీవేంకటేశ్వర సందర్శనం శుభప్రదం.

మిథునం

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదడం మంచిది.

కర్కాటకం

పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహం

సంతృప్తికర ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. ప్రారంభించిన పనులలో పురోగతి ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్యసిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రం చదవడం మంచిది.

కన్య

కార్యజయం ఉంది. కీర్తి వృద్ధి చెందుతుంది. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. అర్థలాభం ఉంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

తుల

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. సూర్యస్తుతి మేలు చేస్తుంది.

వృశ్చికం

చక్కని కార్యసిద్ధి ఉంది. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనం తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి. మంచి జరుగుతుంది. శ్రీఆంజనేయ సందర్శనం శుభప్రదం.

ధనుస్సు

ప్రారంభించబోయే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. కొన్ని  సంఘటనలు బాధ కలిగిస్తాయి, అధైర్యపడకుండా ముందుకు సాగితే మేలైన ఫలితాలు వస్తాయి. దుర్గాస్తుతి చదవడం మంచిది.

మకరం

ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. సమర్థతను పెంచాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. శ్రీవేంకటేశ్వరుని సందర్శనంతో శుభఫలితాలు పొందుతారు.

కుంభం

మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలను అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాలలో తలదూర్చకండి. శ్రీలక్ష్మీధ్యానం శుభప్రదం. 

మీనం

పనులను వాయిదా వేయకండి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. గణపతి ఆరాధన శుభప్రదం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని