Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 02 Jun 2023 03:19 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థానచలనం సూచితం. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. తోటివారి సహాయం ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.

అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని  చేస్తుంది.  ఆరోగ్యం అనుకూలంగా ఉంది. దుర్గాదేవి సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.

ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. నిందారోపణలు చేసేవారున్నారు. కలహాలకు దూరంగా ఉండాలి. సాయిబాబా సందర్శనం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

కాలానుగుణంగా ముందుకు సాగండి అనుకున్నది సిద్ధిస్తుంది. స్థిరమైన నిర్ణయాలతో అనుకూలఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయసహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీవిష్ణునామాన్ని జపించడం మంచిది.

అదృష్టఫలాలు అందుతాయి. మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.

ప్రారంభించిన కార్యక్రమాల్లో నిబద్ధత అవసరం. కీలక వ్యవహారాలలో  కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి . కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి.చంద్రశేఖరాష్టకం చదవాలి.

శుభకాలం. ముఖ్య పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం చదవడం వల్ల మీలోని ఆత్మశక్తి పెరుగుతుంది.

అనుకున్నది సాధించడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. బంధు,మిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీరామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు.బంధు,మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభకరం. 

 

మంచి మనస్సుతో  చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. ఇష్టదేవతా ఆరాధన మేలు చేస్తుంది.

ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి.

మీమీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. అష్టమ చంద్ర దోషం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. చంద్ర ధ్యానం జపించడం ఉత్తమం.

- ఇంటర్నెట్‌ డెస్క్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని