Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/06/2023)

Published : 04 Jun 2023 00:25 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అందరినీ కలుపుకొనిపోతే ఇబ్బంది ఉండదు. వివాదాల్లో తలదూర్చకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివుడిని ఆరాధించాలి.

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన శుభప్రదం.

 ప్రారంభించిన పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల మీద దృష్టి తగ్గించి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయ పారాయణ శ్రేయస్కరం. 

కాలానుగుణంగా ముందుకు సాగండి. మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా కలిసివచ్చే కాలం. అంతా శుభమే జరుగుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

ప్రారంభించిన కార్యక్రమాల్లో నిబద్ధత చాలా అవసరం. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చంద్రశేఖరాష్టకం చదవాలి.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. బంధుప్రీతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీ మనసుపై ప్రభావం చూపేవారు ఉన్నారు. ఇష్టదైవ స్తోత్రాన్ని చదివితే మంచిది.

మీలోని పోరాట పటిమ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. అధికారులు మీ పట్ల మిశ్రమ వైఖరితో ఉంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

 

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మీదైన రంగంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త  వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. తోటివారి సహకారంతో ఒక ముఖ్య వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. శ్రీరామ నామాన్ని జపించాలి. 

- ఇంటర్నెట్‌ డెస్క్

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు