Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/03/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
మనోబలంతో పనులను పూర్తి చేస్తారు. దేహసౌఖ్యం ఉంది. ధనాగమన సిద్ధి కలదు. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
చేపట్టే పనులలో చంచల స్వభావం రానీయకండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడకపోవచ్చు. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
దైవబలం అనుకూలిస్తోంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైన లాభాన్నిస్తాయి. ఈశ్వర సందర్శనం ఉత్తమం.
మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. గిట్టనివారితో జాగ్రత్త. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
మీ మీ రంగాల్లో క్రమశిక్షణతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సొంతమవుతాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పని చేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది.
మంచి కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.
అనుకూలమైన కాలం కాదు. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయవద్దు. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. విందు, వినోద సుఖాలు కలుగుతాయి. శరీర సౌఖ్యం ఉంది. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు అవసరం. శ్రీ విష్ణు ఆరాధన చేస్తే మంచిది. సూర్య ఆరాధన శుభదాయకం.
తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. మంచి భోజన సౌఖ్యం కలదు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయవద్దు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
హుషారుగా పనిచేయండి. స్థిరమైన నిర్ణయాలు మంచినిస్తాయి. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఇష్టదైవారాధన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: మమ్మల్ని అంతం చేసే కుట్రే..! రాహుల్కు శిక్షపై ప్రతిపక్షాల మండిపాటు
-
India News
AAP Vs BJP: దేశ రాజధానిలో ‘పోస్టర్’ వార్..!
-
Movies News
Nani: ఆ దర్శకుడు అందరి ముందు నన్ను అవమానించాడు: నాని
-
Crime News
Crime News : స్టాక్ మార్కెట్ మోసగాడు.. 27 ఏళ్ల తర్వాత చిక్కాడు!
-
Politics News
Cm Kcr: రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం.. ఎకరాకు రూ.10వేలు పరిహారం: సీఎం కేసీఆర్
-
Movies News
Samantha: అలాంటి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది: సమంత