Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/03/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
మంచి కాలం. పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. విష్ణు నామస్మరణ శుభప్రదం.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. చంద్రధ్యానం శుభప్రదం.
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధన వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.
రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయమిది. బంధు,మిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. గోసేవ చేయాలి.
శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, విందు, వినోద, వ్యాపార కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. దైవారాధన మానవద్దు.
చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మితభాషణం శ్రేయస్కరం. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం మంచిది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనోబలం పెరగడంతో పాటు మంచి ఫలితాలు పొందగలుగుతారు.
మంచికాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధన,ధాన్య వృద్ధి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శివనామస్మరణ శుభకరం.
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది . ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభకరం.
పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఆపదలు తొలగడానికి గోవిందనామాలు చదవాలి.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావొస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Mamata Banerjee: ఆయన విపక్షాలను నడిపిస్తే.. మోదీని ఎదుర్కోలేం..!
-
Movies News
Kangana Ranaut: ఎలాన్ మస్క్ ట్వీట్.. సినిమా మాఫియా తనని జైలుకు పంపాలనుకుందంటూ కంగన కామెంట్
-
General News
Delhi liquor case: ఈడీ ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
-
India News
Amritpal Singh: అమృత్పాల్ కోసం మూడో రోజు వేట.. మామ, డ్రైవర్ లొంగుబాటు
-
Politics News
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత.. తెదేపా ఎమ్మెల్యేలపై దాడి!
-
Sports News
Surya Kumar Yadav: ‘సూర్య’ ప్రతాపం టీ20లకేనా?.. SKYని డీకోడ్ చేసేశారా?