Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/03/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.
చేపట్టిన పనులలో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మీకు రావాల్సిన అవకాశాలు రాకపోవడం, పక్కవాళ్లకు రావడంతో కాస్త నిరుత్సాహం ఆవరిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు.శివుడిని ఆరాధించాలి.
సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ముఖ్యమైన సందర్భాల్లో పెద్దల ఆశీర్వచనాలు రక్షిస్తాయి. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కుటుంబంలో అభిప్రాయబేధాలు రానీయకండి. బంధు,మిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.
మీ మీ రంగాల్లో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి.బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు.మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.గణపతి ఆరాధన చేస్తే మంచిది.
మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల ఫలిస్తాయి. హనుమత్ దర్శనం శ్రేయస్సును ఇస్తుంది.
మనోబలంతో ముందుకు సాగండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు. కొన్ని విషయాలలో మీరు అనుకున్నదానికన్నా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఎవరితోనూ విభేదించకండి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.
చేపట్టే పనుల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి.బంధువులతో వైరసూచన. ప్రయాణాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీలక్ష్మిగణపతి ఆరాధన శుభప్రదం.
చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి