Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.
చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నారాయణ మంత్రాన్ని జపించాలి.
మనసు పెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ద్వాదశ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
సౌభాగ్యసిద్ధి ఉంది. స్థిరనిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఆరాధన శుభప్రదం.
శ్రేష్ఠమైన కాలం. ప్రారంభించన పనులలో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతాస్తోత్రం చదివితే ఇంకా బావుంటుంది.
ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి.పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది
జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. ఒక వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. కలహం సూచన. ఆవేశాలకు పోకూడదు. శ్రమ అధికం అవుతుంది. లింగాష్టకం చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.
కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. సాయిచరిత్ర పారాయణ మంచిది.
అనుకూలమైన సమయం. బంధు,మిత్రులతో కలిసి కీలక విషయాలను చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుందరకాండ పారాయణ శుభప్రదం.
సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దానికంటే గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.
చేపట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురుకాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి. మంచి ఫలితాలు సొంతం అవుతాయి. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు
-
General News
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
India News
Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 43కుపైగా రైళ్లు రద్దు..
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!
-
India News
Ashwini Vaishnaw: రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు చెప్పలేం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
World News
అడవిలో.. పాపం పసివాళ్లు ఏమయ్యారో!