Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/03/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 31 Mar 2023 02:17 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గా ధ్యానం చేస్తే మంచిది.

శుభఫలితాలు ఉన్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే లభిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

ముఖ్య విషయాల్లో అప్రమత్తత అవసరం. బద్ధకాన్ని దరిచేరనీయకండి. బంధువుల సహకారం అందుతుంది. బంధువులతో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. ఆదిత్యహృదయం చదివితే బాగుంటుంది.

మీదైన ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు.  భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. గురుధ్యానం శుభప్రదం

సంపూర్ణ మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కలహ సూచన ఉంది. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఈశ్వర ధ్యాన శ్లోకం చదవాలి.

ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో శుభకాలం. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన శుభప్రదం.

కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. సొంతింటి నిర్మాణ వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. కులదైవ సందర్శనం శుభప్రదం.

మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.  ఇష్టదేవత సందర్శనం మేలు చేస్తుంది.

విజయసిద్ధి కలదు. చేపట్టిన పనులను మీరు అనుకున్నవిధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. మీ మీ రంగాల్లో  మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సును ఇస్తుంది.

 

మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబాభివృద్ధికి సంబందించిన శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.  లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

గ్రహబలం అనుకూలిస్తోంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంది. సత్పురుషుల సాంగత్యం ఉంటుంది. ఈశ్వర దర్శనం శుభకరం.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు తప్పవు.  భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. దుర్గాస్తుతి చదవాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు