Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/03/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని చదివితే అన్ని విధాలా మంచిది.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
మనోధైర్యంతో ప్రయత్నించి కార్యక్రమాలను పూర్తిచేస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధు,మిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చంద్రశేఖరాష్టకం చదివితే మంచిది.
మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.
ప్రారంభించిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చంద్రధ్యానం మేలు చేస్తుంది.
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన శుభప్రదం.
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను సాగదీయకుండా త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్య హృదయం చదవడం మంచిది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
-
Politics News
Ganta Srinivasa Rao: ఫైనల్స్‌లో వైకాపా ఉండదు
-
Politics News
Kola Guruvulu: కోలా గురువులుకు మళ్లీ నిరాశే
-
Ap-top-news News
Botsa Satyanarayana: నాకు 2 మార్కులే ఇస్తామన్నారుగా: మంత్రి బొత్స
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Politics News
kotamreddy giridhar reddy: తెదేపాలోకి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి