Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/03/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది.
చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలుంటాయి.
కీలక వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇష్టదేవతా స్తోత్ర పారాయణ చేస్తే మంచిది.
మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సుకు చెప్పిన విధంగా నడుచుకోండి సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచి ఫలితాలనిస్తుంది.
ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. దైవారాదన మానవద్దు.
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు తొలగడానికి రామరక్షా స్తోత్రం చదివితే మంచిది.
పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ భాద్యతలు అధికమవుతాయి, ఒక పరీక్షలా వాటిని ఎదురుకోవలసి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచి ఫలితాలనిస్తుంది.
అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాల విషయంలో మీకు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.
భవిష్యత్ ప్రణాళికలను అమలుచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆంజనేయ స్వామి సందర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ సోత్ర పారాయణ చేయాలి.
అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం, ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం .
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు.వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’
-
India News
కరెంటు కోతతో కోపోద్రిక్తుడై.. డిప్యూటీ సీఎం ఇంట్లో బాంబు పెట్టానంటూ ఫోన్!
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు