Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/03/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనఃపీడ ఉంది. మానసిక ప్రశాంతత కోసం శివనామాన్ని జపించడం ఉత్తమం.
శుభకాలం. అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మీ మనశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీఆంజనేయస్వామి సందర్శనం శుభకరం.
ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శివనామాన్ని జపించాలి.
ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. ప్రారంభించిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తిచేయగలుగుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేయగలుగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. సూర్య ఆరాధన శుభప్రదం
మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండాచూసుకోవాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కీలక విషయాలను కొన్నాళ్లపాటు వాయిదా వేయడం మంచిది. కలహసూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.
శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనోబలం పెరగటానికి లక్ష్మీధ్యానం శుభకరం.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth Reddy: 2016 గ్రూప్-1 ఫలితాల్లోనూ అక్రమాలు: రేవంత్ రెడ్డి ఆరోపణ
-
Sports News
Nani - Dasara: టీమ్ ఇండియా స్టార్లకు పేర్లు పెట్టిన నాని.. ఎవరికేం పేరు ఇచ్చాడంటే?
-
World News
Putin: మేరియుపోల్లో పుతిన్ పర్యటన.. ఉక్రెయిన్ యుద్ధంలో నాశనమైన నగరం
-
World News
Trump - Musk: అదే జరిగితే ట్రంప్ మళ్లీ గెలవడం ఖాయం.. మస్క్ జోస్యం
-
Movies News
Janhvi Kapoor: ఎన్టీఆర్తో సినిమా.. ప్రతిరోజూ దేవుడిని ప్రార్థించా: జాన్వీకపూర్
-
Crime News
Accident: కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు.. 17 మంది మృతి!