Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/03/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
మేషం (Aries): శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
వృషభం (Taurus): చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
మిథునం (Gemini): మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్ధికసాయం అందుతుంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.
కర్కాటకం (Cancer): శుభకాలం. మంచిపనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన శుభకరం.
సింహం (Leo): పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.
కన్య (Virgo): కార్యసిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
తుల (Libra): చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం (Scorpius): అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.
ధనుస్సు (Sagittarius): మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతంగా వాతావరణం ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.
మకరం (Capricornus): మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
కుంభం (Aquarius): మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
మీనం (Pisces): మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో మనఃసంతోషాన్ని పొందుతారు. ఆర్థికపరంగా మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM Modi: భారత ఆర్థికాభివృద్ధి.. ప్రజాస్వామ్య ఘనతే: ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Rohit Sharma: ఐపీఎల్లో రోహిత్‌కు విశ్రాంతి.. ముంబయి కోచ్ ఏమన్నాడంటే?
-
Movies News
Anushka Sharma: కాపీరైట్ ఆమెదే.. అనుష్క శర్మ పన్ను కట్టాల్సిందే..!
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా
-
Sports News
IPL 2023: ఎంఎస్ ధోనీకిదే చివరి సీజనా..? రోహిత్ సూపర్ ఆన్సర్