Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.
ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మానసిక సౌఖ్యం ఉంది. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం.
అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువుల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
కీలక విషయాల్లో శ్రద్ధను పెంచాలి. సందర్భానుసారంగా ముందుకు సాగండి. బంధు, మిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. మొహమాటంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివాలయ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ప్రయత్న కార్యానుకూలత ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.
మీ మీ రంగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. గురువుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.
ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. అలసటకు గురికాకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. దైవబలం రక్షిస్తోంది. ఇష్టదైవం సందర్శనం శుభప్రదం.
బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంట్లో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
ధర్మసిద్ధి ఉంది. ఏకాగ్రతతో పనిచేయండి, అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దైవానుగ్రహంతో చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని సమర్ధంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
మానసిక ప్రశాంతత ఉంది. మీ మీ రంగాల్లో మంచిపేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.
ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా శ్లోకం చదవాలి.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/06/23)
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్‌సర్కార్
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Sports News
Virat Kohli: ‘మిడిల్ ఆర్డర్‌కు వెన్నెముక.. ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు’