Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బందులపాలవుతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన శుభప్రదం.
అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.
పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. అష్టమ చంద్ర దోషం ఉంది. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
కార్యసిద్ధి ఉంది. ప్రారంభించిన పనులలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.
మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్త పడాలి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి..
మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. వాతావరణం ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.
మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆర్థికపరంగా మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sachin - Gill: గిల్లో ఆ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి: సచిన్
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’.. వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రం: కృతి సనన్
-
World News
China: రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామి.. ఏర్పాట్లు సర్వం సిద్ధం..!
-
General News
Isro-Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్12.. ప్రయోగం విజయవంతం
-
Politics News
Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల
-
Crime News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం