Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 17 May 2023 00:15 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శ్రద్ధగా పనిచేయాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులకు పోవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి.  సూర్యస్తుతి శక్తిని ఇస్తుంది.  

అనుకున్నది సాధించే దిశగా పయనిస్తారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి  సందర్శనం ఉత్తమం.

ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన పురోగతి రావాలంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనఃస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్ట దైవ సందర్శనం శుభప్రదం.

మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలు ఉన్నాయి. గిట్టనివారితో మితభాషణం అవసరం. స్థానచలనం సూచితం. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం.

మనోధైర్యంతో చేసే పనులు సఫలం అవుతాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీ మనసుపై ప్రభావం చూపేవారు ఉన్నారు. చంద్రశేఖర అష్టకం చదివితే మంచిది.

ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మంచికాలం. అందరినీ కలుపుకొనిపోతే ఇబ్బంది ఉండదు. శివుడిని ఆరాధించాలి.

కీలక సమయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు. బంధు,మిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దశావతార స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

 

చేపట్టిన పనులలో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక విషయాలలో సమస్యలు తొలగి కుదురుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మాటను గౌరవిస్తే సమస్యలు తొలుగుతాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. గిట్టనివారి జోలికి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు