Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/05/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ప్రారంభించబోయే పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి మాట్లాడాలి. మనఃపీడ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
సౌభాగ్యసిద్ధి ఉంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతాస్తుతి శుభకరం.
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోవద్దు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది.
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మంచిది.
ఉద్యోగంలో మీ పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపించాలి.
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. శ్రీలక్ష్మీధ్యానం శుభప్రదం.
అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ పక్కనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారున్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు చాలా అవసరం. శివనామస్మరణ చేయడం ఉత్తమం.
శరీర సౌఖ్యం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్ దిగ్భ్రాంతి
-
General News
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ