Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/05/2023)

Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది.  డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.

Published : 30 May 2023 01:05 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్యక్రమ ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించే విధంగా ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు  చదవాలి. 

సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చు పెట్టాలి. సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది.

చేపట్టే పనిలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబంలో సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది.

అలసట పెరగకుండా చూసుకోవాలి. ఆలోచనలే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి దర్శనం వల్ల మంచి జరుగుతుంది.

మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధు,మిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. బంధు,మిత్రులతో మాట్లాడేటప్పుడు వాదప్రతివాదాలు లేకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. గురుశ్లోకం చదవాలి.

ప్రయత్నానుకూలత ఉంది. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్య, ఆర్ధిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

 

ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. మీ మీ రంగాల్లో విజయం సొంతం అవుతుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలుస్తారు. లక్ష్మీ అష్టోత్తరం చదివితే ఇంకా మంచిది.

ప్రారంభించిన కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖర్చు చేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి. ఈశ్వర నామాన్ని స్మరించండి.

విజయ సిద్ధి ఉంది. గమ్యం చేరే వరకు పట్టుదలను వీడకండి. ఎలాంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శ్రీనివాసుని దర్శనం శక్తిని ఇస్తుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని